Search Results

63 items found

Blog Posts (54)

 • కర్మ మరియు విధి(ప్రారబ్ధం) యొక్క ప్రాముఖ్యత (Importance of karma and destiny)

  నమస్తే. జై శివాయ్. ఇక్కడ మనం కర్మ మరియు వీధి లేదా ప్రారబ్దం యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుకుందాం. మనం జీవితంలో ఏదైనా పని అసలు ఎందుకు చేయాలి అని చాలా మంది నన్ను అడుగుతారు. ఎందుకంటే మన జీవితంలో మనం ఏమి చేయగలమో మరియు ఏమి చేయాలేమో, మనకు ఏమి జరుగుతుంది మరియు ఏమి జరగదు, అన్నీ మన ప్రారబ్ధ కర్మలో ఉంటాయి కదా అని అనుకుంటారు. మన జీవితంలో మనకు లభించేది మరియు లభించనిది మన ప్రారబ్ధ కర్మ ప్రకారం ఉంటుంది అని అనుకుంటారు. అలాంటి వారికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కేవలం భోగం కోసం ప్రారబ్ధ కర్మ మీకు ఇవ్వబడింది. అది కేవలం అనుభవం కోసం మాత్రమే. మీకు ఒక కర్మ నిల్వ ఉంటుంది. ఇది మీరు చేసిన మొత్తం కర్మలను కలిగి ఉంటుంది. దీనిని సంచిత కర్మ అని పిలుస్తారు. ఈ జీవితకాలంలో సంచిత కర్మలో కొంత భాగం మీకు ఇవ్వబడింది. దీనిని ప్రారబ్ధ కర్మ అని అంటారు. మానవ శరీరం కర్మ దేహం మరియు భోగ దేహం. ఈ మానవ శరీరం తో మనం భోగాన్ని అనుభవించవచ్చు మరియు కర్మ చేయవచ్చు. మనకు చెట్లు, పక్షులు, జంతువులు, కీటకాల లాగ కేవలం భోగ శరీరం మాత్రమే ఉండదు. మిగితా జీవాలు వాటి జీవితం లో ఎం చేయగలవో ముందే నిర్ణయించబడి ఉంటుంది. మానవ జన్మ మాత్రం అలా ఉండదు. మానవ జీవితకాలం అనేది కర్మ మరియు భోగంతో కూడి ఉంటుంది. భోగం అనగా మీరు మీ గత కర్మల యొక్క కొన్ని ఫలితాలను పొందడం. ఇది కర్మ శరీరం కూడా. ఎందుకు? కొంతమంది పది అడుగులు నడుస్తున్నప్పటికీ, వారి జీవితంలో కేవలం రెండు అడుగుల ఫలితాలను మాత్రమే పొందుతారు. మరియు కొంతమందికి, వారు ఏదైనా చేయడానికి ఎంత ప్రయత్నించినా, వారు ఎల్లప్పుడూ ప్రతికూల ఫలితాన్ని పొందుతుంటారు. మీరు జీవితంలో అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంటే మీ కర్మ ఇలా ఎందుకు ఉంది అని మీరు ఆలోచించాలి? మీరు భూత శుద్ధి చేయాలి. కర్మ ప్రభావాన్ని తగ్గించడానికి కొన్ని మార్గాలు తపస్సు చేయడం, యోగా చేయడం, భూత శుద్ధి చేయడం, జపం చేయడం, ప్రాణాయామం చేయడం మరియు క్రియా యోగ చేయడం. ఇవన్నీ చేయడం వల్ల ఈ జీవితకాలంలో కర్మ ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఉదాహరణకు, మీ గత కర్మ కారణంగా మీరు ధనవంతులైన తల్లిదండ్రులకు జన్మించారని అనుకుందాం. ఈ జీవితకాలంలో మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ అకస్మాత్తుగా మీ తల్లితండ్రులు చేసిన ఎదో ఒక కర్మ వలన అది వారి సంపదను కోల్పోయేలా చేసింది మరియు ఇప్పుడు మీరు పేదవారిలాగా జీవిస్తున్నారు. ఇప్పుడు మీరు పెరిగి పెద్దవారయ్యారు మరియు మీ జీవితానికి బాధ్యత వహించాల్సిన సమయం వచ్చింది. మీరు మీ కర్మ ఇంతే అని ఆలోచిస్తూ ఉంటే మీ పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరు ఏమీ చేయకూడదనుకుంటారు. ఈ ఆలోచనా ప్రక్రియ మీ జీవితంలో దేనినీ మార్చలేదు. బహుశా మీకు మీ ప్రారబ్ధ కర్మలో సంపదను ఇచ్చి ఉండవచ్చు. మీరు ఇప్పుడు కొంచెం ప్రయత్నం చేస్తే మళ్లీ సంపదను పొందవచ్చు. కొంతమంది వ్యక్తులు ఎల్లప్పుడూ సరైన సమయంలో, సరైన స్థలంలో, సరైన వ్యక్తులతో, వారి సరైన మనస్తత్వంలో ఎలా ఉంటారో మీరు చూసే ఉంటారు. అది ఎలా సాధ్యం? వారికి ఆ పరిస్థితి ఎలా వచ్చింది? ఆ పరిస్థితులువారి మంచి కర్మల యొక్క ఫలితాలు. మీరు మీ గత మంచి మరియు చెడు కర్మల గురించి ఆలోచించిన కూడా, ఆ కర్మలు ఎవరు చేసారు? అవి కూడా మీరే చేసారు. కాబట్టి, తదుపరి జీవితకాలంలో మంచి కర్మ మరియు ప్రశాంతమైన జీవితాన్ని పొందడానికి మీరు ఇప్పుడు ఏమి చేస్తున్నారు అనేది ముఖ్యం? ఆదర్శవంతంగా, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడిగా, మీరు ఎలాంటి కర్మలైన చేయకుండా ఉండాలి. అలా ఉండాలంటే మీరు మీ యోగ సాధన లేదా తపస్సు చేయడం ప్రారంభించాలి. మీరు ఏమీ చేయకుండా ప్రతిదీ కేవలం విధి లేదా మీ ప్రారబ్దం అనుకుని ఊరుకోకూడదు. అప్పుడు ఎంత ప్రయత్నించినా మీరుఫలితాలు పొందలేరని నిర్ధారించుకున్నట్లు అవుతుంది. పది అడుగులు నడిచిన తర్వాత కూడా మీరు రెండు అడుగుల ఫలితాన్ని పొందినప్పటికీ, ఆ పది అడుగులు నడవండి. లేకపోతే, ఈ రెండు అడుగుల ఫలితాలు కూడా మీకు లభించవు. అవసరమైన కర్మ మాత్రమే చేయండి. మీరు భోగాలను అనుభవించడం ద్వారా కర్మను క్షీణింపజేయవచ్చు. కొత్త కర్మలను సృష్టించకుండా ఉండటానికి మీరు మీ యోగ సాధనను కొనసాగిస్తూ ఉండాలి. దీనిని అగామి కర్మ అంటారు. ఎక్కువ సాధన చేస్తూ ఉండండి. మీ దగ్గర ఒక కారు ఉంటే, మరో పది కార్ల కోసం పరిగెత్తవద్దు. మీకు ఒక ఇల్లు ఉంటే, మరో పది ఇళ్ల కోసం పరిగెత్తవద్దు. మీకు కొంత సంపద ఉంటే, ఎక్కువ సంపదను వెంబడించవద్దు. మీకు ఒక భాగస్వామి ఉంటే, ఇంకొకరి వెంట పరిగెత్తకండి. మీ వద్ద ఉన్నదానితో సంతృప్తి చెందండి. మరియు ఇది కర్మ దేహం కనుక కర్మతో వ్యవహరించడం నేర్చుకోండి. మీరు మీ కర్మను క్షీణింపచేయడంతో పాటు కొత్త కర్మను సృష్టిస్తూ ఉండవచ్చు లేదా కొత్త కర్మను సృష్టించకుండా ఉండవచ్చు. క్రొత్త కర్మను సృష్టించకుండా ఉండటానికి ఏకైక మార్గం ఎల్లప్పుడూ యోగ సాధనలో పాల్గొనడం. అది భక్తి యోగా కావచ్చు, ధ్యానం కావచ్చు. కర్మ జరగని స్థితులు ఈ రెండు మాత్రమే. మిమ్మల్ని ఈ ఐదు క్లిష్ట చిత్త వృత్తులు, అభినవేశం, రాగం, ద్వేషం, అస్మిత మరియు అవిద్య అనేవి బంధనం లో మరియు జీవన్మరణ చక్రంలో ఉండేలా చేస్తాయి. ఈ చిత్త వృత్తులు ఏ కర్మనైనా చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. అక్లిష్ట చిత్త వృత్తులు మీకు మోక్షాన్ని ఇస్తాయి. అక్లిష్ట చిత్త వృత్తులు మిమ్మల్ని మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు నడిపిస్తాయి. ఉదయం మూడు గంటలకు నిద్ర లేవడం మరియు మీ ప్రాణాయామం చాలా తీవ్రతతో చేయాలి అనుకోవడం వంటివి అక్లిష్ఠ చిత్త వృత్తుల వలన మీకు జరుగుతాయి. మీరు చేసే కర్మ మంచి కర్మ లేదా చెడు కర్మ కావచ్చు. మంచి కర్మను శుక్ల కర్మ అని అంటారు మరియు చెడు కర్మను అశుక్ల కర్మ అని అంటారు. ఎక్కువ శాతం ప్రజలు మిశ్రమ కర్మలను చేస్తూ ఉంటారు. కాబట్టి, మీ ఫలితాలు తదనుగుణంగా ఉంటాయి. మీరు ఏదైనా జరిగినప్పుడు ఇది మీ విధి అనుకుని ఏమి చేయకుండా కూర్చోకూడదు ఒకవేళ నా విధిలో ఉంటే నేను ఏదో ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను మరియు నేను ఏమి చేసినా చేయకపోయినా జరిగేది జరుగుతుంది అని అనుకోకూడదు. ఈ జీవితకాలంలో లేదా రాబోయే కొన్నేళ్లలో ఆ విధమైన ఫలితాలను పొందడానికి మీరు ఇప్పుడు ఎలాంటి కర్మలు చేస్తున్నారు అనేది ముఖ్యం. మీ విధి ని మీరే రాసుకుంటారు అనేది సత్యం. మీ గత చర్యల కారణంగా మీకు తదనుగుణంగా ప్రారబ్ధ కర్మ ఇవ్వబడింది. మీకు దాని గురించి మంచిగా అనిపించకపోతే, దాన్ని మార్చడానికి మీరు ఏమి చేస్తున్నారు? మీరు డ్రైవింగ్ చేస్తున్న ప్రతిసారీ ట్రాఫిక్ సిగ్నల్‌ను మర్చిపోతున్నారు మరియు దాని వలన మీరు ప్రతిసారి జరిమానా పొందుతున్నారని అనుకుందాం. మీరు మీ జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులు మీకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు మీరు దాని గురించి చెడుగా భావించి, డ్రైవింగ్ చేసేటప్పుడు శ్రద్ధ వహించకపోవడం మీ ప్రారబ్ధ కర్మ అనుకుని మీరు దాని గురించి ఏమి చెయ్యలేరు అని, డ్రైవింగ్ చేయడం మానెయ్యాలి అనుకోవడం పొరపాటు. దాన్ని అధికమించడానికి మీరు ఏమి చేస్తున్నారు అనేది ముఖ్యం. మీరు ఇప్పుడు డ్రైవింగ్ పాఠాలకు వెళ్తున్నారా? మీరు నియమాలను సరిగ్గా నేర్చుకుంటున్నారా? మీరు ఏదైనా సురక్షితమైన ప్రదేశంలో ప్రాక్టీస్ చేస్తున్నారా? మీకు మీ ప్రస్తుత పరిస్థితి నచ్చకపోతే దానిని మార్చడానికి మీరు ఏమి చేస్తున్నారు? ఉదాహరణకు, తప్పుడు మార్గాల ద్వారా సంపదను పొందిన చాలా మంది సంపన్నులను మీరు చూసే ఉంటారు. ఒకవేళ వారు చెడు పనుల ద్వారా తమ సంపదను సాధించినట్లయితే తదుపరి జీవితంలో వారు పేదవారిగా జన్మించవచ్చు. లేదా వారు పది అడుగులు నడిస్తే ఒక అడుగు ఫలితాలను మాత్రమే పొందుతుంటారు. వారి వద్ద ఉన్న అన్ని వస్తువులు తీసివేయబడతాయి. వారి ఇంట్లో దొంగతనం జరగవచ్చు లేదా ఎవరైనా వారిని దోచుకోవచ్చు. అలాంటివి వారికి జరుగుతాయి. ఈ జీవితకాలంలో చెడు కర్మ ద్వారా వారు సంపాదించినది ఏదైనా వారి నుండి తీసివేయబడుతుంది. ఇది రాబోయే కొన్ని సంవత్సరాలలో జరగవచ్చు లేదా రాబోయే కొన్ని జీవితకాలలో జరగవచ్చు. కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది. కర్మ నుండి తప్పించుకోవడం జరగదు. మీరు దాని పట్ల చాల జాగ్రత్త వహించాలి. మీరు కొందరిని చూసినట్లయితే, వారికి ఎప్పుడు ఎదో చెడు జరుగుతూ ఉంటుంది, వారు కొంత డబ్బు సంపాదించవచ్చు మరియు అది దోచుకోబడవచ్చు, వారు ఎవరికైనా పని చేయవచ్చు మరియు వారికి తగిన ఫలితం లభించక పోవచ్చు. మీకు అర్హమైన జీతం లేదా ప్రమోషన్ మీకు అందకపోవచ్చు. అప్పుడు ఈ జీవితకాలంలో మీరు పొందిన భోగం లేదా ప్రారబ్దం మీకు నచ్చలేదని దీని అర్థం. కాబట్టి, దాన్ని మార్చడానికి మీరు ఏమి చేస్తున్నారు? మీరు ఎన్ని దాన ధర్మాలు చేస్తున్నారు? మీరు ఎంత హృదయపూర్వకంగా ఉంటున్నారు? మా పిల్లలకు ఆహారం ఇవ్వడానికే మా వద్ద తగినంత డబ్బులేదు అలాంటప్పుడు మేము దాన ధర్మాలు ఎలా చేస్తాం అని అనుకోవచ్చు. దానం అనేది ఎల్లప్పుడూ డబ్బును దానం చేయడం కాదు. దాతృత్వం అనేది ఎవరికైనా లేదా ఏదో ఒక కారణం కోసం సమయం ఇవ్వడం. మీ శరీరంతో లేదా మీ మనస్సుతో మీరు చేయగలిగినదంతా దాతృత్వం చెయ్యవచు. కాబట్టి, మీరు ఏమి చేస్తున్నారు? దాతృత్వం అనేది ఇతరులకు జ్ఞానాన్ని ఇవ్వడం కావచ్చు, ఇతరులకు సహాయపడటం కావచ్చు, వృద్ధాశ్రమానికి వెళ్లి వృద్ధులకు మరియు అనారోగ్యంతో ఉన్నవారికి సేవ చేయవచ్చు, మంచి పనులలో స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. మీ గత కర్మ ఫలితాలను తిప్పికొట్టడానికి మీరు ఎలాంటి మంచి కర్మలు చేస్తున్నారు అనేది ముఖ్యం. కేవలం భోగం లేదా కేవలం విధి వంటివి ఏవీ లేవు. ప్రతిదీ దానికి అదే జరిగిపోతోంది అని మీరు అనుకోకూడదు. మీరు కేవలం భోగం కలిగి ఉండటానికి మొక్క , జంతువు లేదా మరే ఇతర శరీరంలో లేరు. మీరు శక్తివంతమైన మానవ శరీరంలో ఉన్నారు. మీ చెడు కర్మ ఫలితాలను వదిలించుకోవడానికి మీరు సరైన కర్మ చేయాలి. మీ మంచి కర్మ మీ చెడు కర్మ ప్రభావాన్ని రద్దు చేస్తుందని కాదు, కానీ మీరు చేసే మంచి కర్మ భవిష్యత్తులో తిరిగి చెల్లించబడుతుంది. మీరు ఒక చేదు ఆపిల్ చెట్టును నాటినట్లు అయితే, మీరు దాని వేర్లకు ఎన్ని చెక్కర సంచులను పోసినప్పటికీ మీరు చేదు ఆపిల్ పండును మాత్రమె ఇస్తుంది. మీ జీవితాన్ని మార్చే మార్గం ఇది కాదు. తీయని యాపిల్ పండ్లను పొందడానికి మీరు తీయని యాపిల్ చెట్టు విత్తనాలను నాటాలి. చేదు ఆపిల్లను వదిలించుకోవడానికి ఇదే మార్గం. మీరు సరైన విత్తనాలను నాటాలి. మీరు ఏమి చెయ్యకుండా ఉంటే ఏమీ జరగదు. మీరు ఏమి చెయ్యకుండా ఉండాలి అంటే మీరు ధ్యానీ లేదా యోగి అయి ఉండాలి. మీరు యోగి లేదా ధ్యాని అయినప్పుడు మీరు ఎలాంటి కర్మ చేయకుండా కూర్చోవచ్చు. కానీ మీరు ఆ దశలో లేకుంటే, మీ కర్మను పరిష్కరించడం కాకుండా ఆ దశకు చేరుకోవడానికి ప్రయత్నించండి. నమస్తే. జై శివాయ్. ఆదిగురు ప్రకృతి Adiguru Prakriti Note - This article is a Telugu Translation of the original English Karma Series Video - Importance of Karma Vs Destiny.

 • యోగి జీవనశైలి -మీ ఆధ్యాత్మిక పురోగతిని ఎలా అంచనా వేయాలి (Evaluating your Spiritual Progress)

  నమస్తే. జై శివాయ్. ఈ రోజు మీ ఆధ్యాత్మిక పురోగతిని ఎలా విశ్లేషించాలో తెలుసుకుందాం. ఆధ్యాత్మిక పురోగతి యొక్క మూల్యాంకనం మీ మొత్తం ఉనికిపై జరగాలి. మీ పురోగతిని అర్థం చేసుకోవడానికి మీరు మీ కోశాలలో ఒకదాన్ని మాత్రమే అంచనా వేయలేరు. మీకు ఐదు కోశాలు ఉంటాయి. మీరు చేస్తున్న ఆధ్యాత్మిక సాధన ఏదైనా కూడా మీ శరీరం మరియు ఉనికి యొక్క ఐదు కోశాలను ప్రభావితం చేస్తుంది. మొదటి కోశం మీ భౌతిక శరీరం. దానిని అన్నమయ కోశం అని పిలుస్తాము. అన్నమయ కోశం మీలో భౌతికంగా ఉన్నదంతా కలిగి ఉంటుంది. మీ యోగ సాధన ద్వారా, మీరు ఏ ఆసనంలోనైనా నొప్పి, లేదా దురద, లేదా శరీరంలో కుదుపు లేకుండా గణనీయమైన సమయం పాటు నిశ్శబ్దంగా కూర్చోగలిగితే, మీ అన్నమయ కోశం అభివృద్ధి చెందిందని చెప్పగలం. ఒక యోగాసనంలో సంపూర్ణంగా ఉండడానికి కనీస సమయం రెండున్నర గంటలు. అయితే మొదట్లో 15 నిమిషాల పాటు భంగిమలో కూర్చోగలరా లేదా అని చూడండి. అప్పుడు నెమ్మదిగా ప్రతిరోజూ సాధన సమయాన్ని పెంచడం ప్రారంభించండి. మీరు కదలకుండా రాయిలా కూర్చోగలరో చూడండి. మీ భౌతిక శరీరంలో ఎలాంటి భంగం కలగకుండా చూడండి. మీ యోగ సాధన చేస్తూ ఉంటె దాని ఫలితంగా మీరు చక్కగా కూర్చోగలుగుతారు. మీరు ఎక్కువసేపు ఏదైనా యోగ భంగిమలో కూర్చోవడానికి సహాయపడటానికి మీ ప్రాణాయామం మరియు క్రియా యోగా చేయవచ్చు. మరొక విషయం ఏమిటంటే యోగ సాధన ఫలితంగా మీ శరీరం చాలా ఆరోగ్యంగా మారుతుంది. మీరు ఆరోగ్యంగా మారడం మొదలుపెడతారు మరియు మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలుగుతారు. యోగ సాధన నుండి ఉత్పన్నమయ్యే శక్తి మీ భౌతిక శరీరంలో ఉంటుంది కాబట్టి మీరు మీ శరీరంలో చాలా ఆటంకాలను నివారించగలుగుతారు. ఫలితంగా, మీ శరీరం ఆరోగ్యంగా మారుతుంది మరియు మీరు తినే ఆహారం ఎంపిక మారుతుంది. మీరు వండిన ఆహారం కంటే ముడి ఆహారాన్ని ఎక్కువగా తినడానికి ప్రయత్నిస్తారు మరియు అది మీకు సహజంగా జరుగుతుంది. మీరు నాన్ వెజిటేరియన్ అయితే సహజంగానే దాన్ని తగ్గిస్తారు. మీరు చేయవలసినది ఏమీ లేదు. ఈ యోగ సాధనాలు మీలో ఒక స్థాయికి చేరుకున్నప్పుడు, మీ దృష్టిలో మరియు మీ ముఖంలో ఎల్లప్పుడూ ఒక రకమైన శక్తి ఉంటుంది. మీరు ఆ శక్తిని ప్రసారం చేయగలరు. సహజంగానే, మీ ఉనికి ఆ శక్తిని ఉత్తేజపరచడం ప్రారంభిస్తుంది మరియు అది మీలో ఎల్లప్పుడూ కనిపిస్తుంది. మీరు శారీరకంగా చూడగలిగే కొన్ని మార్పులు ఇవి. మీ భౌతిక శరీరం విషయానికి వస్తే మీకు అనేక ఇతర విషయాలు జరుగుతాయి. మీ DNA కూడా మారుతుంది కానీ అది ధ్యానం మరియు యోగ సాధనల యొక్క చాలా అధునాతన దశలో జరుగుతుంది. మీ మెదడులోని న్యూరాన్లు మారడం మొదలవుతాయి మరియు మీ మెదడులో కొత్త నాడీ మార్గాలు సృష్టించబడతాయి. కాబట్టి భౌతిక శరీరం చాలా వరకు మారుతుంది. యోగ సాధన మరియు ధ్యానం ద్వారా కణాల స్థాయిలో మార్పులు జరుగుతాయి. కాబట్టి, మీ శరీరం ఎలా మారుతుందనే దాని ఆధారంగా మీరు మీ పురోగతిని అంచనా వేయవచ్చు. మీరు మరింత శక్తివంతంగా ఉంటారు. మీరు మునుపటి కంటే సులభంగా భౌతిక పనులు చేయగలరు. అన్నమయ కోశంలో ఇంకొక విషయం ఏమిటంటే, మీరు మీ శరీర బరువు కంటే చాలా రెట్లు ఎక్కువ బరువును ఎత్తగలుగుతారు. ఇంతకు ముందు మీరు అంత బరువును ఎత్తలేకపోయి ఉండవచ్చు. రెండవ కోశం మీ ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం మారినప్పుడు మీరు మీ చుట్టూ ఉన్న ప్రదేశాలు, వ్యక్తులు మరియు వస్తువుల శక్తికి మరింత సున్నితంగా ఉంటారు. ప్రారంభంలో, మీరు ప్రతికూల శక్తి ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండాలని అనుకోవచ్చు. ఆ వ్యక్తులు మంచి శక్తిని పెంచుకోరు. మీరు అలాంటి శక్తి ఉన్న ప్రదేశాలకు మరియు వ్యక్తులకు దూరంగా ఉండవచ్చు. ఆ రకమైన వ్యక్తులు లేదా ప్రదేశాలపై మీకు సహజమైన విరక్తి ఉంటుంది. మీరు నిర్దిష్ట వ్యక్తులతో మరియు కొన్ని ప్రదేశాలలో ఉండటానికి ఇష్టపడరు, మీరు ఏది పడితే అది తాకడానికి కూడా ఇష్టపడరు. మీరు మీ చుట్టూ భద్రతా సరిహద్దుని సృష్టించుకోడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు కొన్ని గ్రౌండింగ్ పద్ధతులు లేదా స్నానం చేయడం వంటి శుభ్రపరిచే పద్ధతులు చేయవచ్చు. క్లీనింగ్ ప్రాక్టీసెస్ గురించి నా దగ్గర ఒక వీడియో ఉంది, మీరు ఆ వీడియో లింక్‌ని వివరణ పెట్టెలో చూడవచ్చు. మీ శక్తిని సురక్షితంగా ఉంచడానికి మీరు చేయగలిగేవి చాలా ఉన్నాయి. మరొక విషయం ఏమిటంటే అది మీలో భయాన్ని రేకెత్తించకూడదు. ప్రతికూల శక్తి ఉన్న వ్యక్తులందరికీ దూరంగా ఉండటం మంచిది, కానీ భయంతో కాదు. మీ స్వంత సాధన ద్వారా మీరు సేకరించిన శక్తివంతమైన శక్తి కేవలం క్షీణిస్తుందనే వాస్తవాన్ని తెలుసుకోవడం వలన ఇది చేయవచ్చు. మీ ఇంట్లో ఒక చిన్న మొక్క ఉంది అనుకుందాం. అది చనిపోయే సమయంలో మాత్రమే మీరు దానికి నీరు ఇస్తున్నారు అనుకోండి. అప్పుడు ఆ మొక్క అంతగా పెరగదు మరియు అది తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఎల్లప్పుడూ మనుగడ ఆలోచనలో ఉంటే, పరిణామం జరగదు. మీ శక్తిని ఆదా చేయడం మంచిది, ఆ విషయంలో స్వార్థంగా ఉండండి. ఎందుకంటే మీరు ఉదయం లేచి, ఎక్కువసేపు కూర్చొని మీ సాధన చేయడానికి బాగా కష్టపడుతున్నారు. ఇతర వ్యక్తులు ఎలాంటి సాధన చేయడం లేదు. వారు కేవలం వారి అచేతనంగా నడిచే చిత్తవృత్తిలో ఉన్నారు. వారు ఎల్లప్పుడూ వారి అర్ధంలేని స్థితిలో ఉంటారు. కాబట్టి మీ శక్తిని హరించే మరియు మీ శక్తిపై జీవించడానికి ప్రయత్నించే వ్యక్తుల నుండి దూరంగా ఉండటానికి మీకు పూర్తి హక్కు ఉంది. నెమ్మదిగా, కొంతకాలం తర్వాత, మీ ప్రాణమయ కోశం చాలా శక్తివంతమైనదిగా మారడం ప్రారంభమవుతుంది. ఒక దశలో మీ శక్తి ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకుంటుంది. అప్పుడు చాలా నెగటివ్ ఎనర్జీ ఉన్న కొందరు వ్యక్తులు మీరు చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నప్పుడు మిమ్మల్ని కలవడానికి ప్రయత్నిస్తుంటే, ఏదో ఒకవిధంగా మిమ్మల్ని కలిసే వారి ప్లాన్ రద్దవుతుంది. ఎవరైనా చెడు శక్తిని పొందడం ప్రారంభిస్తే, వారి చుట్టూ ఉన్న పరిస్థితులు స్వయంగా మారడం మరియు జరగడం ప్రారంభమవుతుంది. వేరే వాళ్ళు మీ ఇంటికి రాలేరు, మీరు వెళ్లి వారిని కలవలేరు. సాధారణంగా, ప్రతికూల శక్తి సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని మనం అనుకుంటాం. కానీ సానుకూల శక్తి దాని చుట్టూ ఉన్న చెడు శక్తిని తిప్పికొట్టడం ప్రారంభిస్తుంది. ఆ విధంగా, ప్రజల ప్రణాళిక మారుతుంది, స్థలాలు మారుతాయి మరియు మీరు ఆ స్థాయికి చేరుకున్నప్పుడు ఈ విషయాలు స్వయంచాలకంగా జరగడం ప్రారంభిస్తాయి. మీరు మరింత సున్నితంగా మారతారు, మీరు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. మీ ప్రాణమయ కోశాన్ని విశ్లేషించడానికి అదే మార్గం. మీరు ఒకరిని కలవకుండా, చూడకుండా కూడా వారు మంచివారా లేదా చెడ్డవారా అని తెలుసుకోవడం ప్రారంభిస్తారు. ఈ రోజు వారు ఎలాంటి శక్తిలో ఉన్నారో మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు వారిని చూడటానికి లేదా వారిని కలవడానికి మీ ప్రణాళికలను మార్చవచ్చు. మూడవది మనోమయ కోశం. మనోమయ కోశంలో మీ బుద్ధి, అహం, చిత్త మరియు మనస్సు ఉంటాయి. మనోమయ కోశం మనలో చాలా పెద్దది. ఇది మన భౌతిక శరీరానికి మించి 9 నుండి 10 అడుగుల వరకు విస్తరించి ఉంటుంది. ఇది చాలా పెద్దది మరియు మీరు సాధన చేసే కొద్ది ఇది ఇంకా పెద్దదిగా మారడం ప్రారంభమవుతుంది. మీ చిత్తవృత్తులు మీ మానసిక భావోద్వేగ ప్రవర్తనలను సృష్టిస్తాయి. ఈ కోశం పెరిగే కొద్దీ మీకు మరియు ఇతర వ్యక్తుల మధ్య సరిహద్దు తగ్గిపోవడం మొదలవుతుంది. మీకు మరియు ఇతర ప్రదేశాల మధ్య సరిహద్దు తగ్గిపోవడం మొదలవుతుంది. అలాగే మీకు మరియు ఇతర విషయాలకు మధ్య సరిహద్దు తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. కాబట్టి, అవతలి వ్యక్తి ఏమనుకుంటున్నారో మీరు వారిని చూడకుండా, వారిని కలవకుండానే తెలుసుకోగలుగుతారు. ప్రారంభంలో, వారు మీ ముందు ఉన్నప్పుడు అది జరుగుతుంది. మీరు ఇతరుల మనస్సులలోకి ప్రవేశించగలరు మరియు వారి ఉద్దేశాలను తెలుసుకోగలుగుతారు. మీరు ఉద్దేశపూర్వకంగా అలా చేయాలనుకుంటున్నందున కాదు, అది సహజంగా జరగడం ప్రారంభమవుతుంది. మరొక విషయం ఏమిటంటే, ఇది ఎల్లప్పుడూ బాహ్య ప్రపంచానికి సంభందంచిన విషయాల గురించే కాదు. మీ చిత్త వృత్తులు, వాసనలు మరియు మానసిక-భావోద్వేగ మరియు ప్రవర్తనలు కూడా అవి మీలో ఒక భావోద్వేగాన్ని లేదా ఆలోచనను సృష్టించే ముందు మీరు తెలుసుకోగల సామర్థ్యాన్ని పొందుతారు. ప్రారంభంలో మీకు ఎదురయ్యే భావోద్వేగం లేదా ఆలోచన ద్వారా వాటిని పట్టుకోగలుగుతారు కానీ యోగ సాధనాల ఫలితంగా మీ మనోమయ కోశ మరింత బలంగా మారడం ప్రారంభమవుతుంది. అప్పుడు చిత్త వ్రిత్తులు మీలో ప్రారంభం అయ్యే ముందే మీరు వాటిని గ్రహించడం మొదలు పెడతారు. మరొక విషయం ఏమిటంటే, ఏ కోరిక అయినా మీ హృదయంలో లోతుగా ఉందా అని చూసుకోవాలి. మీకు ఏదైనా కోరిక ఉంటే అది జరిగిపోతుంది. మీకు మంచి ఉద్దేశం ఉంటే అది జరిగిపోతుంది మరియు మీకు ఏదైనా చెడు ఉద్దేశం ఉన్నప్పటికీ అది కూడా జరిగిపోతుంది. మీకు ఒకానొక సమయంలో కేవలం మంచి ఉద్దేశాలు మాత్రమే ఉంటాయి. ఇవి ఆక్లిస్టా సంస్కారాలు లేదా అక్లిస్ట చిత్త వృత్తుల నుండి ఉత్పన్నమయ్యే కోరికలు. ఒక సమయంలో అవి మాత్రమే మిగిలి ఉంటాయి మరియు అవి జరగడం ప్రారంభమవుతుంది. కానీ మొదట్లో మంచి చెడు రెండూ వ్యక్తమవుతాయి. కాబట్టి అప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒక విధంగా మీరు వాటిని సిద్ధి లాగా చూడవచ్చు. మీరు మీ చిత్త వృత్తులను చూడగలరు. కాబట్టి అవి మీలో తలెత్తకముందే మీరు వాటిని చూడగలుగుతారు. మీరు ఏదైనా చెప్పినప్పుడు, లేదా ఏదైనా చేసినప్పుడు లేదా మీరు ఏదైనా కోరుకున్నప్పుడు మీరు మీ చిత్త వృత్తులను అర్థం చేసుకుని మీరు చేసే పనుల మూలాలని స్పష్టంగా చూడగలుగుతారు. యోగ సాధన యొక్క ఉద్దేశ్యం వేరొకరిపై పి. హెచ్‌.డి చేయడం కాదు. మీరు వేరొకరిపై పి. హెచ్‌.డి చేయడం ద్వారా జ్ఞానోదయం పొందలేరు. మీరు ఇతరుల ప్రవర్తన, స్వభావం మరియు వారి జీవితాన్ని విశ్లేషించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు విశ్లేచించుకున్నప్పుడే మీరు జ్ఞానోదయం పొందుతారు. కాబట్టి మీరు మీ యోగ సాధనాన్ని ఎక్కువగా మీపై ఉపయోగించుకునేలా చూసుకోండి, ఇతర వ్యక్తులపై కాదు. కాబట్టి మీలో ఆత్మావలోకనం చేసుకోవడానికి మీ మనోమయ కోశాన్ని ఉపయోగించండి. మీలో ఒక కోరిక తలెత్తినప్పుడు, అది ఎక్కడ నుండి వస్తుందో మరియు అది మీలో ఎందుకు తలెత్తుతుందో మీరు చూడాలి. మరియు మీలో ఒకరకమైన భయం తలెత్తినప్పుడు కూడా, నేను ఎందుకు భయపడుతున్నాను, ఈ భయం ఏమిటి మరియు నేను దేనికి భయపడుతున్నానో మీరు ఆత్మపరిశీలన చేసుకోవచ్చు. ఈ ప్రశ్నలను మిమ్మల్ని మీరు అడగడానికి ప్రయత్నించండి మరియు ఈ ప్రశ్నలకు సమాధానం మీకు తెలుస్తుంది. నాల్గవ కోశం విజ్ఞానమయ కోశం. ఇది సహజమైన శరీరం కాదు. ఇది మీ ఉనికికి చాలా పెద్ద కవచం మరియు ఇది విశ్వ మేధస్సును కలిగి ఉంటుంది. ఇది మీలో గురు చక్రాన్ని, మూడో కన్నును కూడా కలిగి ఉంటుంది. ఇది మీకు కాలాన్ని మించి చూసే సామర్థ్యాన్ని ఇస్తుంది. దాని పనులలో ఒకటి అంతః దృష్టి. వ్యక్తులను చూసే ముందు కూడా వారు ఎలాంటి శక్తితో ఉన్నారో మీకు తెలుస్తుంది. మీరు ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని సందర్శించే ముందు, ఆ స్థలం ఎలా ఉందో ఏమిటో మీకు ముందే తెలుస్తుంది. ఏదైనా చెడు జరగబోతున్నట్లయితే, అది మీకు ముందే తెలిసిపోతుంది. కాబట్టి, మీ అంతః దృష్టి పనిచేస్తున్నంత వరకు, మీరు మీ ఆధ్యాత్మిక సాధనలో ఏదైనా తప్పు చేస్తే, మీరు పొరపాటు చేస్తున్నారని మీకు తెలుస్తుంది మరియు మీరు మీ గురువుని అడగాలి అని కూడా తెలుస్తుంది. కావున, విజ్ఞానమయ కోశం విశ్వ మేధస్సును గురించి. ఇది కాలాన్ని మించిన విశ్వం యొక్క సత్యాన్ని మీకు అందిస్తుంది. ఇది దుర్గాదేవి, లక్ష్మిదేవి, సరస్వతిదేవి, మరియు గతంలో అవతరించిన అందరు గురువులను, అందరు శక్తులను గురించిన సత్యాన్ని మీకు అందిస్తుంది. ఈ శక్తి చాలా శక్తివంతమైనది మరియు ఇది విశ్వంలో ఉన్న మొత్తం జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. మీ చిత్త లో మీరు సంస్కారాన్ని సృష్టించడం ఒక విషయం. చిత్త అనేది మీ కార్మిక నిలువ, ఇక్కడ మీ మానసిక భావోద్వేగ ప్రవర్తన నమూనాలు, మీ కర్మలు మరియు మీ గురించి ప్రతిదీ నిల్వ చేయబడుతుంది. దీని గురించి తెలుసుకోడానికి మీరు మీరు పతంజలి యోగ దర్శనం వీడియో సిరీస్‌ను చూడవచ్చు. మరియు చిత్త అంటే ఏమిటి, సంస్కారాలు ఎలా పనిచేస్తాయి, సంస్కారాలు అంటే ఏమిటి, చిత్తవృత్తులు అంటే ఏమిటి మరియు దానికి సంబంధించిన అనేక ఇతర విషయాలు అర్థం చేసుకోవచ్చు. నేను ఈ వీడియో యొక్క వివరణ పెట్టెలో ఆ సిరీస్‌కు లింక్‌ను అందిస్తాను. వేరొకరి చిత్త మీద సంస్కారాన్ని సృష్టించడం వేరే విషయం. గురువులు ఎవరికైనా దీక్ష ఇచ్చినప్పుడు అదే చేస్తారు. వారు అవతలి వ్యక్తి చిత్త లో ఆక్లిస్టా సంస్కారాలను సృష్టిస్తారు. అది వారిని మోక్షం, జ్ఞానం మరియు సత్యం వైపు తీసుకువెళుతుంది. గురువులు దానిని శిష్యులలో సృష్టించగలరు. విశ్వం లో ఒక ముద్రను సృష్టించడం పూర్తిగా భిన్నమైన విషయం. ఈ సృష్టి సజీవంగా ఉన్నంత వరకు ఆ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. మరియు చాలా జ్ఞానం ఉన్న సమాధి గురువులందరూ, వారి జీవితకాలంలో తమ జ్ఞానాన్ని పొందగలిగే వ్యక్తిని కనుగొనలేకపోతే, భవిష్యత్తులో వేరొక యోగి ఆ జ్ఞానాన్ని పొందడానికి మరియు ఉపయోగించుకోవడానికి వారు విశ్వం లో ఆ జ్ఞానం యొక్క ముద్రను సృష్టిస్తారు. ఇవన్నీ విజ్ఞానమయ కోశం ద్వారా జరుగుతాయి. నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేముందు విశ్వం లో ఒక ముద్రను సృష్టించడానికి చాలా శక్తితో పాటుగా నా విజ్ఞానమయ కోశాన్ని ఉపయోగించాలి. సమాధి గురువులందరూ అలా చేస్తారు. మీరు ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, లేదా పర్వతం లేదా ప్రకృతిలోని కొన్ని ప్రదేశాలలో, కొన్ని దేవాలయాలలో లేదా శక్తి వోర్టెక్స్ ఉన్న కొన్ని ప్రదేశాలను సందర్శించినప్పుడు మీరు బలమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందుతారు లేదా మీకు బలమైన ఆధ్యాత్మిక సాక్షాత్కారం జరుగుతుంది. ఏ జీవితంలోనైనా ఎవరైనా సమాధిని సాధించిన వారు, వారి జ్ఞానాన్ని ఎవరికైనా ఇవ్వాలనుకుంటే కానీ ఆ జ్ఞానాన్ని మానవత్వం కోసం ఉపయోగించగల సరైన వ్యక్తివారికి ఆ జన్మ లో కనిపించకపోతే వారు ఆ జ్ఞానాన్ని విశ్వం లో ఒక ముద్రగా సృష్టిస్తారు. అన్ని అష్ట సిద్ధిలు విజ్ఞానమయ కోశం ద్వారా జరుగుతాయి. నా యూట్యూబ్ ఛానెల్‌లో అష్ట సిద్ధిలపై వీడియో ఉంది మరియు వాటి గురించి మీరు అక్కడ తెలుసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా కలవగలిగే అన్ని శక్తిలు, దేవి లేదా దేవతలను మీరు కలవగలిగితే అది మీ విజ్ఞానమయ కోశం ద్వారా జరుగుతుంది. మీ గత జన్మలలో ఏవైనా గురువు మీకు దీక్ష ఇచ్చినట్లయితే, ఈ జీవితకాలంలో ఆ దీక్ష ఉనికిలోనికి రావాలి అంటే మీ విజ్ఞానమయ కోశ పూర్తిగా అభివృద్ధి చెంది ఉండాలి. మీ ఆధ్యాత్మిక పురోగతిని అంచనా వేయడానికి మీరు ఈ విషయాలన్నింటినీ పరిశీలించాలి. చివరిది ఆనందమయ కోశం. ఆనందమయ కోశాను సాధారణంగా బ్లిస్ బాడీకి అనువదిస్తారు, కానీ అది ఖచ్చితమైన అర్థం కాదు. అన్నమయ కోశాన్ని ఆత్మ తనంతట తానుగా గ్రహించే వరకు మానవ జీవితకాలంలో అది ఆత్మకు ఆధారం గా పరిగణించబడుతుంది. కానీ స్వీయ సాక్షాత్కారం లేదా మోక్షం పొందిన తరువాత ఆనందమయ కోశం ఆధారం అవుతుంది. మేము ఆనందమయ కోశం ద్వారా ప్రతిదీ గ్రహిస్తాము. మరియు ఆనందమయ కోశం వ్యక్తిగత పొర కాదు, మన భౌతిక శరీరం వలె దీనికి సరిహద్దు లేదు. భౌతిక శరీరం మీకు సమయం మరియు స్థలంలో స్థానికీకరణను అందిస్తుంది. ఆనందమయ కోశానికి స్థానికీకరణ లేదు. ఆనందమయ కోశంలో మీరు మరియు నేను లేరు లేదా భౌతిక విభజన లేదు ఎందుకంటే దాని ఆధారం పరమాత్మ నుండి విస్తరించబడింది. ప్రతిదీ పరమాత్మలో ఉన్నప్పటికీ అది పరమాత్మ యొక్క ప్రత్యక్ష సాక్షాత్కారం. మరియు స్వీయ-సాక్షాత్కారం పొందిన వారు ఎల్లవేళలా ఆనందంలో ఉండడానికి కారణం అదే. వారు ఎల్లప్పుడూ బ్రహ్మ మరియు పరమాత్మలో ఉన్నట్లు భావిస్తారు. వారికి విభజన ఉండదు, మరియు స్థానికీకరణ భావన కోల్పోయి ఉంటుంది. కానీ భౌతిక శరీరం స్థానికీకరించబడి ఉంటుంది. భౌతిక శరీరానికి సమయం ఉంటుంది, స్థలం ఉంటుంది, ఆకారం ఉంటుంది. కనుక ఇది మనకు తెలిసిన భౌతిక సృష్టిలో కొనసాగుతుంది. కాబట్టి మోక్షం తర్వాత మీలో స్థానికీకరణ భావన పోతుంది. ఆనందమయ కోశంతో ఉన్న మరో విషయం ఏమిటంటే, ఇది మీకు అలౌకిక సిద్దులను ఇస్తుంది. మీ నాలుగు శరీరాలు లౌకిక స్వభావం కలిగిన సిద్ధులను పొందగలవు. లౌకిక సిద్ధి అనేది సంస్కృత పదం. అంటే కనిపించే ప్రపంచానికి లేదా భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాలు అని అర్ధం. మీ మొదటి నాలుగు కోశాల ద్వారా ఈ సిద్ధులను పొందవచ్చు. మీ విజ్ఞానమయ కోశాన్ని చాలా వరకు అభివృద్ధి చేసినప్పుడు మాత్రమే అవన్నీ జరుగుతాయి. ఆనందమయ కోశం ఈ పరిమాణానికి మించిన అలౌకిక్ సిద్ధిలను మీకు అందిస్తుంది. ఇవి భౌతిక లేదా స్థూల ప్రపంచానికి సంబంధించినవి కావు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ మానసిక భావోద్వేగ ప్రవర్తనా విధానాలు లేదా చిత్తవృత్తులు మీపై కలిగి ఉన్న పట్టును తగ్గించడం ప్రారంభిస్తుంది. మరియు నెమ్మదిగా మీ చిత్తలో తక్కువ భంగాలు కలుగుతున్నాయని మీరు గ్రహిస్తారు. దీనికి కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు లేదా ఒక జీవితకాలం పట్టవచ్చు. ఇది చాలా జీవితకాలాల ప్రయాణం. రెండు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు లేదా పదేళ్లలో ఏదో జరుగుతుందని అనుకోకండి. ఏమీ జరగకపోతే, మీలో ఇంకా ఏదో మిగిలి ఉంది అని అర్ధం. మోక్షాన్ని పొందకుండా మిమ్మల్ని మీరు కాకుండా ఇంకా ఎవరు ఆపలేరు. సిద్ధిలను పొందకుండా మిమ్మల్ని మీరు కాకుండా ఇంకా ఎవరు ఆపలేరు. అన్ని రకాల విశ్వ మేధస్సును పొందకుండా మిమ్మల్ని మీరు కాకుండా ఇంకా ఎవరు ఆపలేరు. మీ గురు చక్రం లేదా మీ మూడవ కన్ను తెరవకుండా మిమ్మల్ని మీరు కాకుండా ఇంకా ఎవరు ఆపలేరు. మీరే ప్రతిదానికి భాద్యత వహించాలి అని గమనించండి. ఏదైనా జరగకపోతే, తప్పు ఏమిటో తెలుసుకోవడం మీ భాద్యత. ఒకవేళ మీకు అర్థం కాకపోతే, మీరు దాని గురించి విచారించడం లేదా కలవరపడాల్సిన అవసరం లేదు. మీరు గురువు కోసం వెతకవచ్చు. గురువులు మీ చిత్త లోపల చూడగలరు మరియు మీలో ఏమి జరుగుతుందో వారు మీకు చెప్పగలరు. మీకు గురువు ఉన్నప్పటికీ, ప్రతి చిన్న విషయానికి వారిని సంప్రదించవద్దు. ఇది ఎందుకు జరగడం లేదు అది ఎందుకు జరగడం లేదు అని వారిని అడగవద్దు. సాధన చెయ్యడానికి దానికి తగినింత సమయం కేటాయించి నిజాయితిగా ప్రయత్నం చేస్తే అది 6 నెలలు పట్టవచ్చు లేదా 1 సంవత్సరం పట్టవచ్చు లేదా 5 సంవత్సరాలు పట్టవచ్చు, కాని మీకు తప్పకుండ ఫలితం లభిస్తుంది. మీరు మీ గురువులను లేదా ఉపాధ్యాయులను లేదా ఎవరినైనా ఏదైనా చెప్పి మోసగించవచ్చు అనుకుంటే చివరికి మీరే మోసపోతరు. మీరు చేసే పనులలో, చెప్పే విషయాలలో చాలా నిజాయితీగా ఉండండి. కొన్నిసార్లు మీరు సత్యాన్ని తిరస్కరిస్తూ ఉండవచ్చు. ఏదైనా విషయాన్ని పట్టుకుని వదలకుండా ఉండవచ్చు. మరియు మీరు చేసి పని సరైనదే అని మిగితా వ్యక్తులు చెప్పాలని కోరుకుంటూ ఉంటారు. చాలా మంది ప్రజలు ఆధ్యాత్మిక గురువుల వద్దకు వెళతారు. వారు తమలో అన్ని బాధలు మరియు ద్వేషాన్ని పట్టుకుని గురువు వద్దకు వస్తారు. వారు చేసే పని సరైనదే అని గురువు చెప్పాలని కోరుకుంటారు. కాబట్టి, ఈ కోశాలన్నింటి కోసం వెతకండి మరియు ప్రతి స్థాయిలో మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి. చివరిగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, మీ చిత్తా వృత్తులు లేదా సంస్కారాలు తగ్గడం ప్రారంభించాలి. ఇంతకు ముందు మీరు చాలా కోపంగా ఉండవచ్చు మరియు ఇప్పుడు మీకు కోపం కలగక పోవచ్చు. ముందు మీరు చాలా భయపడుతూ ఉండవచ్చు మరియు ఇప్పుడు మీరు దేనికీ భయపడుతూ ఉండకపోవచ్చు. ఇంతకు ముందు మీరు ఎవరితోనైనా లేదా కొన్ని చోట్ల చాలా అటాచ్‌మెంట్‌లు పెట్టుకుని ఉండవచ్చు మరియు ఇప్పుడు మీరు అలా ఉండలేకపోవచ్చు. ఇంతకు ముందు మీరు ఒకరిపై ద్వేషాన్ని కలిగి ఉండవచ్చు కానీ ఇప్పుడు మీరు అలా ఉండలేరు. ఈ రకమైన మార్పులు అత్యంత ముఖ్యమైన మార్పులు. "చిత్త వృత్తి నిరోధ" అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని సిద్ధిలు సాధించినా, మీ విజ్ఞానమయ కోశం పూర్తిగా అభివృద్ధి చెందినా కూడా మీ గురించి మీరు పూర్తిగా తెలుసుకోనంత వరకు మీకు మోక్షం కలుగదు. దీని అర్థం కొన్ని ఇతర రకాల బాధలు ఎల్లప్పుడూ ఉంటాయి. మీరు శారీరకంగా అనారోగ్యానికి గురైతే, మీ శరీరం మాత్రమే అనారోగ్యంతో ఉందని మరియు మీరు బాగానే ఉంటారని అనుకునే స్థాయికి మీరు అభివృద్ధి చెందాలి. మానసికంగా మీరు మీ శారీరక అనారోగ్యంతో బాధపడరు. మానసికంగా మీరు మీ చుట్టూ ఉన్న జీవిత పరిస్థితులు లేదా మీ రోజువారీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలతో బాధపడరు. చిత్త వృత్తి నిరోధం జరిగే వరకు కొన్ని బాధలు ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి, ఇది కేవలం మోక్షానికి సంబంధించినది కాదు. మీకు మోక్షం లేదా వైరాగ్యం లేదా ఆత్మసాక్షాత్కారం అర్థం కాకపోయినా పరవాలేదు. కానీ ప్రతి ఒక్కరూ తమకున్న అన్ని బాధలను వదిలించుకోవడానికి ప్రయత్నించాలి. జీవితంలో ఎవరూ బాధపడాలని అనుకోరు. మరియు అది చాలా ముఖ్యమైన విషయం. మీ మనస్సులోని బాధలను తొలగించడానికి యోగ సాధనాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విషయాలు అన్నింటిపై మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి. నమస్తే. జై శివాయ్. ఆదిగురు ప్రకృతి Adiguru Prakriti Note - This article is a Telugu Translation of the original English Yogic Lifestyle Video Session 09 - Evaluating your Spiritual Progress

 • యోగి జీవనశైలి -ఆత్మ మరియు పరమాత్మపై ధ్యానం (one- pointedness and meditation on Atma and paramatma)

  నమస్తే. జై శివాయ్. యోగి జీవన శైలి అనే అంశంలో మొత్తం తొమ్మిది పోస్టులు ఉన్నాయి. అందులో ఇది ఎనిమిదవది. ఈ రోజు ఆత్మ మరియు పరమాత్మపై ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఆత్మ అనగా మీరు మరియు పరమాత్మ అనగా మీ ఆధ్యాత్మిక సాధనల ద్వారా మీరు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాథమిక విషయం ఉంది. ఉదాహరణకి, మీకు తెలియని చందన్ అనే వ్యక్తి ఉన్నాడని అనుకుందాం. చందన్ గురించి వేరొకరు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారనుకోండి. మరియు ఆ చెప్పే వ్యక్తి, చందన్ ఒక కరుణామయుడు, చందన్ చాలా మంచి పనులు చేస్తాడు, చందన్ చాలా మంచి ప్రవర్తన కలిగి ఉంటాడు, చందన్ చాలా పొడవుగా మరియు అందంగా ఉంటాడు అని మరియు అతను చందన్ గురించి చాలా మంచి విషయాలు చెప్పాడు అనుకుందాం. అప్పుడు మీరు మీ మనసులో చందన్‌ను చిత్రించుకోవడం ప్రారంభిస్తారు. కొంతకాలం పాటు అవతలి వ్యక్తి ప్రతిరోజూ చందన్ గురించి మీకు చెబుతూ ఉంటే, మీరు అతని గురించి విన్న దాని నుండి, మీరు అతని లక్షణాలను తెలుసుకోవడం ప్రారంభిస్తారు. అకస్మాత్తుగా చందన్ మీ ఇంట్లో ఒక రోజు కనిపిస్తే, మీరు అతన్ని మొదటిసారి కలిసినట్లు మీకు అనిపించదు. ఎందుకంటే అతని గురించి చాలా విషయాలు మీకు తెలుసు. మీకు చాలా కాలంగా తెలిసిన వ్యక్తిని మీరు కలుస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. పరమాత్మ విషయంలో కూడా అదే జరుగుతుంది. మీరు పరమాత్మను ఎన్నడూ చూడలేదు. ఆయన నిరాకారుడు మరియు నిర్గుణుడు. కనుక పరమాత్మను ఊహించడానికి మార్గం లేదు. నిరాకారుడు అంటే రూపం లేనివాడు. నిర్గుణుడు అంటే తనలో ఏ గుణమూ ప్రత్యక్షంగా లేనివాడు. ఎలాంటి లక్షణాలు లేని పరమాత్మను ఎలా గుర్తించాలి? అలా చేయడం సాధ్యం కాదు. అప్పుడు ఎలాంటి గుణం లేని పరమాత్మను తెలుసుకోవడానికి మార్గం ఏమిటి? మీరు ధారణ చేయడం లేదా పరమాత్మ లక్షణాలలో ఒకదానిపై దృష్టి పెట్టడం ద్వారా ప్రారంభించాలి. ఈ విషయం పిల్లవాడు తన తల్లిని గుర్తించడాన్ని పోలి ఉంటుంది. శిశువు చిన్నగా ఉన్నప్పుడు, తన తల్లి యొక్క స్వరం ద్వారా, ఆమె వాసన ద్వారా తన తల్లిని గుర్తిస్తుంది. శిశువు ఎదగడం ప్రారంభించినప్పుడు, శిశువు పట్ల ఆమె ప్రేమ మరియు ఆమె అతనిని చూసుకునే విధానం వంటి తన తల్లి యొక్క విభిన్న లక్షణాలను శిశువు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తుంది. మాట్లాడని చిన్న పిల్లవాడు తన తల్లిని గుర్తించగలిగితే, సరిగ్గా అదే విధంగా మనం కూడా పరమాత్మను గుర్తించగలం. కాబట్టి చింతన లేదా పరమాత్మ గుణాలపై ధరణను పెట్టడం ప్రారంభించడానికి మార్గం. పరమాత్మ లక్షణాలలో సృష్టి ఒకటి, అతను సృష్టికర్త. ప్రతిదీ వారి కర్మల ప్రకారం సృష్టించబడే ఒక అద్భుతమైన వ్యవస్థను రూపొందించడాన్ని ఊహించండి. దాని స్వంత మేధస్సు కలిగిన శరీరాన్ని సృష్టించడం గురించి ఆలోచించండి. మీలోని అదే కణం కిడ్నీగా మారుతుంది, అదే కణం మీ మెదడు పాత్రను పోషిస్తుంది, అదే కణం మీ కాలేయం, మీ గుండె మరియు మీ కళ్ళుగా మారుతుంది. మీ చుట్టూ ఉన్న మొక్కలు మరియు అన్ని ఇతర వస్తువుల విషయంలో కూడా అదే ఉంటుంది. ఇది అంత అద్భుతమైన సృష్టి. మీరు మీ చుట్టూ ఉన్న విషయాలను గమనిస్తే, ప్రతిదీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది మరియు ప్రతిదీ ఒకదానికొకటి సహాయం చేసుకుంటూనే ఉంటుంది. ఉదాహరణకు, మహాసముద్రాల కారణంగా మేఘాలు ఏర్పడతాయి, మేఘాలు ఏర్పడటం వల్ల వర్షాలు కురుస్తాయి, వర్షం కారణంగా నదులు ఉంటాయి, నదులు మరియు వర్షాల కారణంగా అడవులు మరియు మొక్కలు వృద్ధి చెందుతాయి, అడవులు మరియు మొక్కల కారణంగా మళ్లీ వర్షం కురుస్తుంది, వర్షం కారణంగా నదులు ప్రవహిస్తాయి, మరియు నదులు మహాసముద్రాలను సృష్టిస్తాయి. ఈ అద్భుతమైన యంత్రాంగం కారణంగా, మానవులు ఈ గ్రహం మీద అభివృద్ధి చెందారు. మరియు అటువంటి అద్భుతమైన పరస్పర ఆధారిత వ్యవస్థలో సరైన క్రమంలో అమర్చబడిన అనంతమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి, ప్రతిదీ ఎలా నిర్వహించబడుతుందో గమనించండి. మరియు ప్రతిదీ ఎలా నాశనం అవుతుందో కూడా అర్థం చేసుకోండి. ఇప్పటివరకు ఈ ప్రపంచం లో చాలా నాగరికతలు నాశనమయ్యాయి. అనేక ప్రదేశాలు నీటిలో మునిగిపోయాయి. మనం మనిషి అనే కోణం నుండి విధ్వంసాన్ని చూస్తాము. మనకు మాత్రమే జరిగిన విధ్వంసాన్ని మనం చూస్తాము. కానీ మీరు గమనిస్తే, మానవులు ఇతర జీవులకు చాలా విధ్వంసం కలిగిస్తారు. మనం అన్ని చోట్లా నడుస్తూ ఉంటే, అనేక చీమలు చనిపోతూ ఉంటాయి. అది కూడా విధ్వంసం కిందకి వస్తుంది. సూక్ష్మ స్థాయి నుండి స్థూల స్థాయి వరకు విధ్వంసం చూడండి. అన్ని స్థాయిలలో సృష్టి, సృష్టి యొక్క నిర్వహణ మరియు సృష్టి యొక్క విధ్వంసం చూడండి. ఇవి పరమాత్మ యొక్క సులభంగా అర్థమయ్యే లక్షణాలు. మీరు ఈ విషయాలపై ధారణ లేదా ధ్యానం చేయవచ్చు. మీరు పరమాత్మ యొక్క ఇతర లక్షణాలను కూడా చూడవచ్చు. పరమాత్మ న్యాయాన్ని ప్రేమించే వ్యక్తి. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికీ మరియు ప్రతిదానికీ న్యాయం ఉంది. ఆత్మ జీవితాన్ని చూడండి. మానవ ఆత్మ మాత్రమే కాదు, ఒక ఆత్మ అనేక జీవితాల్లో అనేక రూపాలను పొందగలదు. ఇది అనేక ఇతర జీవితాలలో అనేక శరీరాలను తీసుకుంటూ ఉండవచ్చు. కాబట్టి, ఆత్మ యొక్క మొత్తం ప్రయాణంలో, అన్ని సమయాలలో అన్యాయాన్ని భరించాల్సిన అవసరం లేదు. ఇతర ఆత్మ మీకు అన్యాయం చేస్తే, మీకు అనేక విధాలుగా పరిహారం లభిస్తుంది. భగవంతుడు లేదా పరమాత్మ దయ కారణంగా పరిహార ప్రణాళిక ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఎల్లప్పుడూ న్యాయం ఉంటుంది, అది ఈ శరీరంలో లేదా ఈ జీవితకాలంలో జరగకపోతే, అది తరువాతి జీవితకాలంలో జరుగుతుంది. మీ మంచి కర్మల విషయంలో కూడా అదే జరుగుతుంది. మీరు ఈ జీవితకాలంలో ఏదైనా మంచి పని చేస్తే, ఈ జీవితకాలంలో మీకు ఫలితాలు రాకపోయినా, తదుపరి జీవితంలో మీరు దాన్ని పొందవచ్చు. కానీ మీకు ఎలాంటి అన్యాయం జరగడానికి మార్గం లేదు. ఇది న్యాయం, దయ, జ్ఞానాన్ని సాధించే అందమైన వ్యవస్థ. మీరు జీవితాన్ని గడుపుతారు, మీరు విషయాలను అనుభవిస్తారు మరియు మీరు మీ అవగాహనను సృష్టిస్తారు, ఆపై మీరు జ్ఞానాన్ని పొందుతారు. మీరు పరమాత్మ యొక్క చాలా సూక్ష్మ లక్షణాన్ని ఎంచుకోవచ్చు. పరమాత్మ సర్వాంతర్యామి. పరమాత్మ లక్షణాలలో ఇది ఒకటి. ప్రతి ఆత్మలోనూ పరమాత్మ ఉంటాడు. కాబట్టి, ప్రతి ఒక్కరూ ఆత్మ అని గౌరవించడం మరియు గుర్తించడం ద్వారా మీరు జీవితాన్ని గడపగలగాలి. ప్రతి ఆత్మకు పరమాత్మతో సంబంధం ఉంటుంది. అది వారి గాఢ నిద్రలో ఉండవచ్చు. ప్రతి ఆత్మకు పరమాత్మతో సంబంధం ఉంటుంది. కాబట్టి, మీరు ఈ జ్ఞానంతో మీ జీవితాన్ని గడపగలిగితే, అదే ధారణ. అది పరమాత్మ లక్షణాలలో ఒకదానిపై ఏకాగ్రత. మీరు పరమాత్మ లక్షణాలలో ఒకదానితో ప్రారంభించవచ్చు. అయితే మీరు కూర్చుని మీ అభ్యాసం చేస్తున్నప్పుడు, మీరు ధారణ చేయాలనుకుంటే, మీరు పరమాత్మ లక్షణాలలో ఒకదాన్ని ఎంచుకోవాలి. కొందరు వ్యక్తులు పరమాత్మ లక్షణాన్ని స్వేచ్ఛ లేదా పరమానందం లేదా సర్వజ్ఞానిగా ఎంచుకుంటారు. సర్వజ్ఞాని అంటే అన్నీ తెలిసినవాడు. మీరు మీ ధారణను ఇలా చెయ్యాలో చూద్దాం ? పరమాత్మ యొక్క ఏ లక్షణాలను మీరు ఎక్కువగా ఆకర్షిస్తారో ఆలోచించండి. నేను మీకు మిస్టర్ చందన్ ఉదాహరణ ఇచ్చాను. కొంతమంది వ్యక్తులు చందన్ డ్రెస్సింగ్ లేదా అతని అందానికి ఆకర్షితులవుతారు. కొంతమంది అతని దయతో ఆకర్షించబడవచ్చు, కొంతమంది అతను మాట్లాడే విధానానికి ఆకర్షితులై ఉండవచ్చు. కాబట్టి, మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షించే మరియు ప్రభావితం చేసే పరమాత్మ యొక్క ఒక లక్షణం కోసం మీలో మీరు శోధించుకోవాలి. ఈ రోజు మీరు ఏదో కనుగొంటారు మరియు రేపు మీరు ఇతర లక్షణాలపై ధారణ చేస్తారు. మీలోని అదే లక్షణాలను అర్థం చేసుకోవడానికి మరియు గ్రహించడానికి కనీసం ఒక లక్షణం మీద ఒక నెల పాటు ధారణను చెయ్యండి. ఒక నెల తరువాత, మరొక లక్షణాన్ని ఎంచుకుని, కొంతకాలం పాటు చేస్తూ ఉండండి. అప్పుడు ఆత్మ భక్తి మీలో ఉద్భవించే సమయం వస్తుంది మరియు ఆ సమయంలో మీకు ఎలాంటి లక్షణాలు అవసరం లేదు. కేవలం ఆత్మ భక్తి ఉంటే చాలు. మీరు ఎవర్ని ఎందుకు ప్రేమిస్తారు అనే ప్రశ్నకు ఎవరైనా ఎప్పుడైనా సమాధానం చెప్పగలరా? లేదు. మీరు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తే, ఎదుటి వ్యక్తి మంచిగా కనిపించడం లేదా బాగా మాట్లాడటం లేదా ఇతర వ్యక్తి చాలా దయగల హృదయం మరియు అనేక ఇతర విషయాలు వంటివి మీకు గుర్తుకు వస్తాయి. ఆ లక్షణాలు వారిలో లేనప్పటికీ మీరు అదే వ్యక్తిని ప్రేమించగలరా? మీరు వారిని నిజంగా ప్రేమిస్తే మాత్రమే మీరు దీనికి అవును అని చెప్పగలరు. ఒకరి లక్షణాల కారణంగా ప్రేమను నాశనం చేయలేము. మీ ప్రియమైనవారు చనిపోయినప్పుడు కూడా మీరు వారిని ప్రేమిస్తూనే ఉంటారు. వారు భౌతికంగా లేనప్పటికీ, మీరు వారిని ప్రేమిస్తూనే ఉంటారు. ఎందుకు? ఎందుకంటే ప్రేమ భక్తిగా మారినప్పుడు ఒక దశ వస్తుంది, దీనిని మనం ఆత్మ భక్తి అని పిలుస్తాము, అది ఆత్మలో ఉత్పన్నమవుతుంది. ఇది ఆత్మ లక్షణం. ఇది మీ మానసిక భావోద్వేగ క్షేత్రం లేదా మీ శరీరం లేదా మనస్సు యొక్క లక్షణం కాదు. ఇది ఆత్మ యొక్క లక్షణం మరియు మీరు ఆత్మగా మారినప్పుడు, మీరు ఆత్మగా జీవించడం ప్రారంభించినప్పుడు మాత్రమే అది బయటకు వస్తుంది. అప్పటి వరకు మీరు పురుషుడిగా, మహిళగా, విద్యార్థిగా, తండ్రిగా, సోదరిగా, కుమార్తెగా, ఉద్యోగిగా, కుమారుడిగా, ఉత్తర భారతీయుడిగా, అమెరికన్‌గా జీవిస్తారు. కానీ ఆత్మగా జీవించరు. మీరు ఆత్మగా జీవించని సమయం వరకు, భక్తి అనేది మీకు కేవలం ఒక మానసిక విషయం. ఈ జ్ఞానం లోపల సాకారం కాదు. భక్తి ఇప్పటికీ మీకు మానసిక మరియు భావోద్వేగ స్థాయిలో ఉంది. అది మీ ఆత్మ స్థాయికి రాలేదు. మరియు ఆత్మ మాత్రమే భక్తిలో పరమాత్మతో ఉండటానికి కారణం. మీ మనస్సు మరియు భావోద్వేగాలు మార్గం కాదు. అప్పటి వరకు మీరు భక్తిలో ఉండవచ్చు ఎందుకంటే మీకు ప్రశాంతమైన జీవితం కావాలి లేదా మీకు ఎక్కువ డబ్బు కావాలి లేదా జీవితం నుండి మీకు ఇంకేదో కావాలి అనుకుంటున్నారు కాబట్టి . కేవలం యోగులు మాత్రమే ఆత్మగా మారడం కాదు, మన జీవితాలలో మనం కేవలం ఆత్మగా ఉండే క్షణాలు కూడా ఉంటాయి. ఇది సత్సంగాలలో, భజనలో మనకు జరగవచ్చు మరియు ఎవరితోనైనా పూర్తిగా ప్రేమలో ఉన్న వ్యక్తులకు కూడా ఇది జరగవచ్చు. మీ గుర్తింపులన్నింటినీ వదులుకోవడంలో మీరు ఎంతవరకు చేరుకున్నారనే దానిపై ఆధారపడి మీ జీవితంలో కొన్ని క్షణాల్లో ఇది మీకు సంభవించవచ్చు. ఇది అన్ని విషయాలపై ఆధారపడి ఉంటుంది. మీరు మీ గుర్తింపులను మరియు మీ అహంకారాన్ని ఎంతగా వదులుకున్నారో అంతగా మీరు ఆత్మగా జీవించడం ప్రారంభిస్తారు. భక్తి అనేది ఆత్మ యొక్క ప్రాథమిక లక్షణాలలో ఒకటి. కాబట్టి, పరమాత్మపై ధ్యానంలో చేయవలసిన అతి ముఖ్యమైన విషయం భక్తిపై దృష్టి పెట్టడం. మరియు మీరు ఆత్మగా ఉన్నప్పుడు మాత్రమే అది జరగవచ్చు. చేయవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆత్మ యొక్క ఈ ప్రాథమిక లక్షణంపై ఏకాగ్రత. లక్షణం ఏమిటంటే మీరు ఎవరి కుమారుడు కారు, ఎవరి కూతురు కారు, ఎవరి తల్లి కారు, ఎవరూ తండ్రి కారు, ఎవరూ సోదరుడు కారు, ఎవరి సోదరి కారు, ఎవరి ఉద్యోగి కారు, మీరు ఏ మతానికి చెందినవారు కాదు, మీరు ఏ జాతికి చెందినవారు కాదు, మీరు దేనికీ చెందినవారు కాదు. మీరు కేవలం ఆత్మ మాత్రమే అన్న భావనలో జీవించడం. ఈ క్షణాలలో మీరు పరమాత్మతో ఉంటారు. ఈ భక్తి అంతిమ దశకు తలుపు. మరియు మీరు అత్యున్నత జ్ఞానాన్ని సాధించే ముందు మీకు జరిగే చివరి విషయం. తీవ్రమైన భక్తి చాలా సంతోషకరమైన విషయం కాదు, ఇది మీ లోపల గొప్ప విషాదాన్ని సృష్టిస్తుంది. ఉదాహరణకు, ఒక పార్కులో ఒక బిడ్డ తన తల్లిని కోల్పోయాడని అనుకోండి. ఎక్కడికి వెళ్ళాలో అతనికి తెలియదు, అతను తన తల్లి కోసం ఏడుస్తున్నాడు. తీవ్రమైన భక్తిలో మీరు ఇలాంటి పరిస్థితి లోనే ఉంటారు . భక్తి మీకు సంతోషాన్ని, శాంతిని, ఆనందాన్ని ఇస్తుందని అనుకోవద్దు. నిజమైన భక్తి అలా కాదు. నిజమైన భక్తిలో మీరు ఏడుస్తూనే ఉంటారు. దీనిని ఆత్మ భక్తి అని పిలుస్తారు మరియు మీరు దానిపై ఎలాంటి నియంత్రణను కలిగి ఉండలేరు. మీరు ఆత్మ మరియు పరమాత్మపై ధారణ చేయగలిగే కొన్ని మార్గాలు ఇవి. నమస్తే జై శివాయ్. ఆదిగురు ప్రకృతి Adiguru Prakriti Note - This article is a Telugu Translation of the original English Yogic Lifestyle Video Session 08 - One Pointedness & Meditation on Atma & Paramatma

View All

Pages (9)

 • Kundalini Intensive | BeingShiva

  KUNDALINI INTENSIVE KUNDALINI INTENSIVE What is Kundalini? Kundalini is a Cosmic Life Force, that is within each human being. This powerful source of life is often dormant and hence human life is lived at an average level. Awakening this source, the Kundalini; helps consciously create the life that one wants to live, helps enhance the experience of life, makes one joyful from within and have better physical and mental/emotional health. It advances the spiritual journey of a seeker to whole another level. What is Kundalini Intensive? Kundalini Intensive is a special program designed by Adiguru Prakriti, to awaken this powerful source of life within, in people of any race, age, gender, religion. Source of life doesn't discriminate, and Kundalini Intensive is a technology, is a proven science to awaken this dormant source of power within you, regardless of your beliefs. It's a set of specially designed Kundalini Kriya & Meditations that are bound to expand the level of consciousness that you are and to give you an experience that will last for a lifetime if you continue to practice. Program Details Length of the Program - 3 Days Everyday Session - 1 hour every day Program Mode - Online through Zoom and/or Skype Pre-requisites - None. Even if you have never done any Yoga/Meditation ever, still you can join & do it. Physical/Health Levels - Do not join if you have any serious, recent physical injury, or if you are pregnant, or if you have delivered a baby recently. To accommodate people from around the world in different time zones, we organise every month at a different time. But you can do it any hour of the day or night if it is possible for you. Fees - AUD $599.00 Program Dates - Please email BeingShivaFoundation@yahoo.com to enquire about the next program dates Program Timing - Please email to enquire Click on the Register Now button below and pay the program fees and you will receive an email with instructions about how to join and the link to join on the day & time of the program. If you have any questions/concerns, please email us at BeingShivaFoundation@yahoo.com Register for Kundalini Intensive Register & Pay

 • Contact | Being Shiva Foundation

  Contact Us TRANSCRIPTION Volunteer for Transcription of our Videos/Talks in English & Hindi. Apply Now TRANSLATION Volunteer for Translation of our Videos/Talks in Hindi and other languages. Apply Now Being Shiva Foundation ABN - 25869328938 Address: Melbourne, VIC Australia Country Code: +61 Phone: 0406-915-025 BeingShivaFoundation@yahoo.com Send Thanks! Message sent.

View All