top of page

కర్మ మరియు విధి(ప్రారబ్ధం) యొక్క ప్రాముఖ్యత (Importance of karma and destiny)





నమస్తే.


జై శివాయ్.


ఇక్కడ మనం కర్మ మరియు వీధి యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుకుందాం.


మనం జీవితంలో ఏదైనా పని అసలు ఎందుకు చేయాలి అని చాలా మంది నన్ను అడుగుతారు.


ఎందుకంటే మన జీవితంలో మనం ఏమి చేయగలము మరియు ఏమి చేయలేము, మనకు ఏమి జరుగుతుంది మరియు ఏమి జరగదు, అన్నీ మన ప్రారబ్ధ కర్మలో ఉంటాయి కదా అని అనుకుంటారు.


మన జీవితంలో మనకు లభించేది మరియు లభించనిది మన ప్రారబ్ధ కర్మ ప్రకారం ఉంటుంది అని అనుకుంటారు.


అలాంటి వారికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.


కేవలం భోగం కోసం ప్రారబ్ధ కర్మ మీకు ఇవ్వబడింది. అది కేవలం అనుభవం కోసం మాత్రమే.


మీకు ఒక కర్మ నిల్వ ఉంటుంది. ఇది మీరు చేసిన మొత్తం కర్మలను కలిగి ఉంటుంది.


దీనిని సంచిత కర్మ అని పిలుస్తారు.


ఈ జీవితకాలంలో సంచిత కర్మలో కొంత భాగం మీకు ఇవ్వబడింది.


దీనిని ప్రారబ్ధ కర్మ అని అంటారు.


మానవ శరీరం కర్మ దేహం మరియు భోగ దేహం.


ఈ మానవ శరీరం తో మనం భోగాన్ని అనుభవించవచ్చు మరియు కర్మ చేయవచ్చు.


మనకు చెట్లు, పక్షులు, జంతువులు, కీటకాల లాగ కేవలం భోగ శరీరం మాత్రమే ఉండదు.


మిగితా జీవాలు వాటి జీవితం లో ఎం చేయగలవో ముందే నిర్ణయించబడి ఉంటుంది.


మానవ జన్మ మాత్రం అలా ఉండదు.


మానవ జీవితకాలం అనేది కర్మ మరియు భోగంతో కూడి ఉంటుంది.


భోగం అనగా మీరు మీ గత కర్మల యొక్క కొన్ని ఫలితాలను పొందడం.


ఇది కర్మ శరీరం కూడా. ఎందుకు?


కొంతమంది పది అడుగులు నడుస్తున్నప్పటికీ, వారి జీవితంలో కేవలం రెండు అడుగుల ఫలితాలను మాత్రమే పొందుతారు.


మరియు కొంతమందికి, వారు ఏదైనా చేయడానికి ఎంత ప్రయత్నించినా, వారు ఎల్లప్పుడూ ప్రతికూల ఫలితాన్ని పొందుతుంటారు.


మీరు జీవితంలో అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంటే మీ కర్మ ఇలా ఎందుకు ఉంది అని మీరు ఆలోచించాలి?


మీరు భూత శుద్ధి చేయాలి.


కర్మ ప్రభావాన్ని తగ్గించడానికి కొన్ని మార్గాలు తపస్సు చేయడం, యోగా చేయడం, భూత శుద్ధి చేయడం, జపం చేయడం, ప్రాణాయామం చేయడం మరియు క్రియా యోగ చేయడం.


ఇవన్నీ చేయడం వల్ల ఈ జీవితకాలంలో కర్మ ప్రభావాన్ని తగ్గించవచ్చు.


ఉదాహరణకు, మీ గత కర్మ కారణంగా మీరు ధనవంతులైన తల్లిదండ్రులకు జన్మించారని అనుకుందాం.

ఈ జీవితకాలంలో మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి.


కానీ అకస్మాత్తుగా మీ తల్లితండ్రులు చేసిన ఎదో ఒక కర్మ వలన అది వారి సంపదను కోల్పోయేలా చేసింది మరియు ఇప్పుడు మీరు పేదవారిలాగా జీవిస్తున్నారు.


ఇప్పుడు మీరు పెరిగి పెద్దవారయ్యారు మరియు మీ జీవితానికి బాధ్యత వహించాల్సిన సమయం వచ్చింది.


మీరు మీ కర్మ ఇంతే అని ఆలోచిస్తూ ఉంటే మీ పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరు ఏమీ చేయకూడదనుకుంటారు.


ఈ ఆలోచనా ప్రక్రియ మీ జీవితంలో దేనినీ మార్చలేదు.


బహుశా మీకు మీ ప్రారబ్ధ కర్మలో సంపదను ఇచ్చి ఉండవచ్చు. మీరు ఇప్పుడు కొంచెం ప్రయత్నం చేస్తే మళ్లీ సంపదను పొందవచ్చు.


కొంతమంది వ్యక్తులు ఎల్లప్పుడూ సరైన సమయంలో, సరైన స్థలంలో, సరైన వ్యక్తులతో, వారి సరైన మనస్తత్వంలో ఎలా ఉంటారో మీరు చూసే ఉంటారు.


అది ఎలా సాధ్యం?


వారికి ఆ పరిస్థితి ఎలా వచ్చింది?


ఆ పరిస్థితులువారి మంచి కర్మల యొక్క ఫలితాలు.


మీరు మీ గత మంచి మరియు చెడు కర్మల గురించి ఆలోచించిన కూడా, ఆ కర్మలు ఎవరు చేసారు?


అవి కూడా మీరే చేసారు.


కాబట్టి, తదుపరి జీవితకాలంలో మంచి కర్మ మరియు ప్రశాంతమైన జీవితాన్ని పొందడానికి మీరు ఇప్పుడు ఏమి చేస్తున్నారు అనేది ముఖ్యం?


ఆదర్శవంతంగా, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడిగా, మీరు ఎలాంటి కర్మలైన చేయకుండా ఉండాలి.


అలా ఉండాలంటే మీరు మీ యోగ సాధన లేదా తపస్సు చేయడం ప్రారంభించాలి.


మీరు ఏమీ చేయకుండా ప్రతిదీ కేవలం విధి లేదా మీ ప్రారబ్దం అనుకుని ఊరుకోకూడదు.


అప్పుడు ఎంత ప్రయత్నించినా మీరుఫలితాలు పొందలేరని నిర్ధారించుకున్నట్లు అవుతుంది.


పది అడుగులు నడిచిన తర్వాత కూడా మీరు రెండు అడుగుల ఫలితాన్ని పొందినప్పటికీ, ఆ పది అడుగులు నడవండి.


లేకపోతే, ఈ రెండు అడుగుల ఫలితాలు కూడా మీకు లభించవు.


అవసరమైన కర్మ మాత్రమే చేయండి.


మీరు భోగాలను అనుభవించడం ద్వారా కర్మను క్షీణింపజేయవచ్చు.


కొత్త కర్మలను సృష్టించకుండా ఉండటానికి మీరు మీ యోగ సాధనను కొనసాగిస్తూ ఉండాలి.

దీనిని అగామి కర్మ అంటారు.


ఎక్కువ సాధన చేస్తూ ఉండండి.


మీ దగ్గర ఒక కారు ఉంటే, మరో పది కార్ల కోసం పరిగెత్తవద్దు.


మీకు ఒక ఇల్లు ఉంటే, మరో పది ఇళ్ల కోసం పరిగెత్తవద్దు.


మీకు కొంత సంపద ఉంటే, ఎక్కువ సంపదను వెంబడించవద్దు.


మీకు ఒక భాగస్వామి ఉంటే, ఇంకొకరి వెంట పరిగెత్తకండి.


మీ వద్ద ఉన్నదానితో సంతృప్తి చెందండి. మరియు ఇది కర్మ దేహం కనుక కర్మతో వ్యవహరించడం నేర్చుకోండి.


మీరు మీ కర్మను క్షీణింపచేయడంతో పాటు కొత్త కర్మను సృష్టిస్తూ ఉండవచ్చు లేదా కొత్త కర్మను సృష్టించకుండా ఉండవచ్చు.


క్రొత్త కర్మను సృష్టించకుండా ఉండటానికి ఏకైక మార్గం ఎల్లప్పుడూ యోగ సాధనలో పాల్గొనడం.


అది భక్తి యోగా కావచ్చు, ధ్యానం కావచ్చు. కర్మ జరగని స్థితులు ఈ రెండు మాత్రమే.


మిమ్మల్ని ఈ ఐదు క్లిష్ట చిత్త వృత్తులు, అభినవేశం, రాగం, ద్వేషం, అస్మిత మరియు అవిద్య అనేవి బంధనం లో మరియు జీవన్మరణ చక్రంలో ఉండేలా చేస్తాయి.


ఈ చిత్త వృత్తులు ఏ కర్మనైనా చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తాయి.


అక్లిష్ట చిత్త వృత్తులు మీకు మోక్షాన్ని ఇస్తాయి.


అక్లిష్ట చిత్త వృత్తులు మిమ్మల్ని మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు నడిపిస్తాయి.


ఉదయం మూడు గంటలకు నిద్ర లేవడం మరియు మీ ప్రాణాయామం చాలా తీవ్రతతో చేయాలి అనుకోవడం వంటివి అక్లిష్ఠ చిత్త వృత్తుల వలన మీకు జరుగుతాయి.


మీరు చేసే కర్మ మంచి కర్మ లేదా చెడు కర్మ కావచ్చు.


మంచి కర్మను శుక్ల కర్మ అని అంటారు మరియు చెడు కర్మను అశుక్ల కర్మ అని అంటారు.


ఎక్కువ శాతం ప్రజలు మిశ్రమ కర్మలను చేస్తూ ఉంటారు. కాబట్టి, మీ ఫలితాలు తదనుగుణంగా ఉంటాయి.


మీరు ఏదైనా జరిగినప్పుడు ఇది మీ విధి అనుకుని ఏమి చేయకుండా కూర్చోకూడదు


ఒకవేళ నా విధిలో ఉంటే నేను ఏదో ఒక రోజు కోటీశ్వరుడిని అవుతాను మరియు నేను ఏమి చేసినా చేయకపోయినా జరిగేది జరుగుతుంది అని అనుకోకూడదు.


ఈ జీవితకాలంలో లేదా రాబోయే కొన్నేళ్లలో ఆ విధమైన ఫలితాలను పొందడానికి మీరు ఇప్పుడు ఎలాంటి కర్మలు చేస్తున్నారు అనేది ముఖ్యం.


మీ విధి ని మీరే రాసుకుంటారు అనేది సత్యం.


మీ గత చర్యల కారణంగా మీకు తదనుగుణంగా ప్రారబ్ధ కర్మ ఇవ్వబడింది.


మీకు దాని గురించి మంచిగా అనిపించకపోతే, దాన్ని మార్చడానికి మీరు ఏమి చేస్తున్నారు?


మీరు డ్రైవింగ్ చేస్తున్న ప్రతిసారీ ట్రాఫిక్ సిగ్నల్‌ను మర్చిపోతున్నారు మరియు దాని వలన మీరు ప్రతిసారి జరిమానా పొందుతున్నారని అనుకుందాం.


మీరు మీ జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులు మీకు నచ్చకపోవచ్చు.


ఇప్పుడు మీరు దాని గురించి చెడుగా భావించి, డ్రైవింగ్ చేసేటప్పుడు శ్రద్ధ వహించకపోవడం మీ ప్రారబ్ధ కర్మ అనుకుని మీరు దాని గురించి ఏమి చెయ్యలేరు అని, డ్రైవింగ్ చేయడం మానెయ్యాలి అనుకోవడం పొరపాటు.


దాన్ని అధికమించడానికి మీరు ఏమి చేస్తున్నారు అనేది ముఖ్యం.


మీరు ఇప్పుడు డ్రైవింగ్ పాఠాలకు వెళ్తున్నారా?


మీరు నియమాలను సరిగ్గా నేర్చుకుంటున్నారా?


మీరు ఏదైనా సురక్షితమైన ప్రదేశంలో ప్రాక్టీస్ చేస్తున్నారా?


మీకు మీ ప్రస్తుత పరిస్థితి నచ్చకపోతే దానిని మార్చడానికి మీరు ఏమి చేస్తున్నారు?


ఉదాహరణకు, తప్పుడు మార్గాల ద్వారా సంపదను పొందిన చాలా మంది సంపన్నులను మీరు చూసే ఉంటారు.


ఒకవేళ వారు చెడు పనుల ద్వారా తమ సంపదను సాధించినట్లయితే తదుపరి జీవితంలో వారు పేదవారిగా జన్మించవచ్చు. లేదా వారు పది అడుగులు నడిస్తే ఒక అడుగు ఫలితాలను మాత్రమే పొందుతుంటారు.


వారి వద్ద ఉన్న అన్ని వస్తువులు తీసివేయబడతాయి.


వారి ఇంట్లో దొంగతనం జరగవచ్చు లేదా ఎవరైనా వారిని దోచుకోవచ్చు. అలాంటివి వారికి జరుగుతాయి.


ఈ జీవితకాలంలో చెడు కర్మ ద్వారా వారు సంపాదించినది ఏదైనా వారి నుండి తీసివేయబడుతుంది.


ఇది రాబోయే కొన్ని సంవత్సరాలలో జరగవచ్చు లేదా రాబోయే కొన్ని జీవితకాలలో జరగవచ్చు.

కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది.


కర్మ నుండి తప్పించుకోవడం జరగదు. మీరు దాని పట్ల చాల జాగ్రత్త వహించాలి.


మీరు కొందరిని చూసినట్లయితే, వారికి ఎప్పుడు ఎదో చెడు జరుగుతూ ఉంటుంది, వారు కొంత డబ్బు సంపాదించవచ్చు మరియు అది దోచుకోబడవచ్చు, వారు ఎవరికైనా పని చేయవచ్చు మరియు వారికి తగిన ఫలితం లభించక పోవచ్చు. మీకు అర్హమైన జీతం లేదా ప్రమోషన్ మీకు అందకపోవచ్చు.


అప్పుడు ఈ జీవితకాలంలో మీరు పొందిన భోగం లేదా ప్రారబ్దం మీకు నచ్చలేదని దీని అర్థం.


కాబట్టి, దాన్ని మార్చడానికి మీరు ఏమి చేస్తున్నారు?


మీరు ఎన్ని దాన ధర్మాలు చేస్తున్నారు?


మీరు ఎంత హృదయపూర్వకంగా ఉంటున్నారు?


మా పిల్లలకు ఆహారం ఇవ్వడానికే మా వద్ద తగినంత డబ్బులేదు అలాంటప్పుడు మేము దాన ధర్మాలు ఎలా చేస్తాం అని అనుకోవచ్చు.


దానం అనేది ఎల్లప్పుడూ డబ్బును దానం చేయడం కాదు.


దాతృత్వం అనేది ఎవరికైనా లేదా ఏదో ఒక కారణం కోసం సమయం ఇవ్వడం.


మీ శరీరంతో లేదా మీ మనస్సుతో మీరు చేయగలిగినదంతా దాతృత్వం చెయ్యవచు.


కాబట్టి, మీరు ఏమి చేస్తున్నారు?


దాతృత్వం అనేది ఇతరులకు జ్ఞానాన్ని ఇవ్వడం కావచ్చు, ఇతరులకు సహాయపడటం కావచ్చు, వృద్ధాశ్రమానికి వెళ్లి వృద్ధులకు మరియు అనారోగ్యంతో ఉన్నవారికి సేవ చేయవచ్చు, మంచి పనులలో స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు.


మీ గత కర్మ ఫలితాలను తిప్పికొట్టడానికి మీరు ఎలాంటి మంచి కర్మలు చేస్తున్నారు అనేది ముఖ్యం.


కేవలం భోగం లేదా కేవలం విధి వంటివి ఏవీ లేవు.


ప్రతిదీ దానికి అదే జరిగిపోతోంది అని మీరు అనుకోకూడదు.


మీరు కేవలం భోగం కలిగి ఉండటానికి మొక్క , జంతువు లేదా మరే ఇతర శరీరంలో లేరు.


మీరు శక్తివంతమైన మానవ శరీరంలో ఉన్నారు.


మీ చెడు కర్మ ఫలితాలను వదిలించుకోవడానికి మీరు సరైన కర్మ చేయాలి.


మీ మంచి కర్మ మీ చెడు కర్మ ప్రభావాన్ని రద్దు చేస్తుందని కాదు, కానీ మీరు చేసే మంచి కర్మ భవిష్యత్తులో తిరిగి చెల్లించబడుతుంది.


మీరు ఒక చేదు ఆపిల్ చెట్టును నాటినట్లు అయితే, మీరు దాని వేర్లకు ఎన్ని చెక్కర సంచులను పోసినప్పటికీ ఆ చెట్టు చేదు ఆపిల్ పండ్లను మాత్రమె ఇస్తుంది.


మీ జీవితాన్ని మార్చే మార్గం ఇది కాదు.


తీయని యాపిల్ పండ్లను పొందడానికి మీరు తీయని యాపిల్ చెట్టు విత్తనాలను నాటాలి.


చేదు ఆపిల్లను వదిలించుకోవడానికి ఇదే మార్గం.


మీరు సరైన విత్తనాలను నాటాలి. మీరు ఏమి చెయ్యకుండా ఉంటే ఏమీ జరగదు.


మీరు ఏమి చెయ్యకుండా ఉండాలి అంటే మీరు ధ్యానీ లేదా యోగి అయి ఉండాలి.


మీరు యోగి లేదా ధ్యాని అయినప్పుడు మీరు ఎలాంటి కర్మ చేయకుండా కూర్చోవచ్చు.


కానీ మీరు ఆ దశలో లేకుంటే, మీ కర్మను పరిష్కరించడం కాకుండా ఆ దశకు చేరుకోవడానికి ప్రయత్నించండి.


నమస్తే.


జై శివాయ్.


ఆదిగురు ప్రకృతి

Adiguru Prakriti


Note - This article is a Telugu Translation of the original English Karma Series Video - Importance of Karma Vs Destiny.






91 views0 comments
© Copyright
bottom of page